- ఎమ్మెల్యే కడియం శ్రీహరి
కాకతీయ, హనుమకొండ : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న లో వోల్టేజ్ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని కోరారు. హన్మకొండలో సీఎండీని కలిసి కొత్త ఆపరేషన్ విభాగాలు, సబ్ స్టేషన్ల మంజూరుకు వినతి పత్రాలు అందజేశారు. కునూర్, మల్కాపూర్, వడిచెర్లలో కొత్త ఆపరేషన్ విభాగాలు ఏర్పాటు చేయాలని, జఫర్‌గఢ్‌లో 132/33కేవీ సబ్‌స్టేషన్, నారాయణపూర్, నష్కల్, పల్లగుట్ట గ్రామాల్లో 33/11కేవీ సబ్‌స్టేషన్లు మంజూరు చేయాలని కోరారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన సీఎండీ వరుణ్ రెడ్డి, కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


