కాకతీయ, ఆదిలాబాద్ : భారీ వర్షాల వల్ల ఇండ్లు కూలిపోయిన, పాక్షికంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వానలతో పూర్తిగా ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన బోథ్, సోనాల, నేరడిగొండ, బజార్హత్నూర్, ఇచ్చోడ, గుడిహత్నూర్, సిరికొండకు సంబంధించిన 30 మంది బాధితులకు రూ.4.22లక్షల నిధులు రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. పంట నష్టానికి సంబంధించిన నిధులు కూడా మంజూరయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.


