ఆరు గ్యారెంటీలను విస్మరించిన రాష్ట్ర బడ్జెట్
వ్యవసాయ కూలీలను పట్టించు కోని ప్రభుత్వం*
సిపిఎం జిల్లా కార్యదర్శి…మచ్చా వెంకటేశ్వర్లు
కాకతీయ ,కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో పేద వర్గాలను విస్మరించిందని సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు.ఆరు గ్యారెంటీలను పట్టించు కోలేదని అన్నారు. రైతు కూలీలకు 12వేల పింఛన్, 2500 మహిళా సబ్సిడీ, 15000 రైతు భరోసా వంటి పథకాలకు కేటాయింపులు లేవన్నారు. బీసీ సంక్షేమానికి న్యాయం జరగలేదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి తగిన నిధులు కేటాయించ లేదన్నారు. విద్యా, వైద్యానికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. వితంతు, వికలాంగులు, వృద్దాప్య పింఛన్లు కేటాయింపులు నామమాత్రం గా ఉన్నాయని విమర్శించారు.
మొత్తంగా చూసినపుడు ప్రభుత్వం పేదలను విస్మరించదని అన్నారు


