- మృతుల్లో ముగ్గురు చిన్నారులు !
- 30 మంది పరిస్థితి విషమం !
కరూర్: తమిళనాడులోని కరూరులో తీవ్ర విషాదం నెలకొంది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. ర్యాలీలో తొక్కిసలాట జరిగి 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నట్లు కూడా ఉన్నట్లు సమాచారం. పలువురు అస్వస్థతకు గురికాగా హుటాహుటిన దవాఖానకు తరలించారు. బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


