కాకతీయ, గీసుగొండ: రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో సెంట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. వరంగల్‌లో జరిగిన ఈ పోటీల్లో బి.శ్రీ వర్ష (8వ తరగతి) రెండవ స్థానం, కె.పూజ (8వ తరగతి) మూడవ స్థానం, పి.సహస్ర (9వ తరగతి) నాల్గవ స్థానం సాధించారు. ఈ ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించడం పాఠశాలకు గర్వకారణ మైందని పాఠశాల కరెస్పాండెంట్ సిస్టర్ ఫ్లెవియా తెలిపారు.
ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ, వారిని ప్రోత్సహించిన ప్రధానోపాధ్యాయులు సిస్టర్ సౌజన్య హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సిస్టర్ సౌజన్య మాట్లాడుతూ, కష్టానికి ప్రత్యామ్నాయం లేదు. క్రమశిక్షణ,అంకితభావం,శ్రమే విజయానికి మెట్లుగా నిలుస్తాయి. విద్యార్థుల కృషి, అంకితభావం, సాహసం ఈ విజయాల మూలం అని పేర్కొన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో అర్హత సాధించిన విద్యార్థులను సెంట్ జాన్స్ ఉపాధ్యాయులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.


