కాకతీయ, కరీంనగర్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక మండపంలో సామూహికంగా శ్రీరమా సత్యనారాయణ స్వామి వ్రతం కన్నుల పండుగగా జరిగింది. ఈ వ్రతాన్ని జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామివారి దివ్య ఆశీస్సులతో ఆలయ వేదపండితులు ఘనంగా నిర్వహించారు. ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వల్ల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, కుటుంబ శ్రేయస్సు కలుగుతాయని విశ్వాసం. భక్తులు తులసి చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించి మొక్కలు చెల్లించారు. కార్తాక దీపారాధనతో పుణ్యఫలాలు లభిస్తాయని, అది మానవునిలోని అంధకారాన్ని తొలగిస్తుందని భక్తులు నమ్ముతారు.
కన్నుల పండుగగా శ్రీరమా సత్యనారాయణ స్వామి వ్రతం
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


