కాకతీయ,హుజురాబాద్: శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదిన వేడుకలను హుజురాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. గురువారం శ్రీ కాకతీయ పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.సందీప్ కుమార్ మాట్లాడుతూ, ఝాన్సీ లక్ష్మీబాయి విద్యతోపాటు సామాజిక సేవకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆమె స్థాపించిన విద్యాసంస్థల ద్వారా అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో నిలుస్తున్నారని తెలిపారు.కార్యక్రమంలో డైరెక్టర్లు మల్లెంపాటి శ్రీధర్, మల్లెంపాటి శ్రీవిద్య, ఏజీఎం మధుసూదన్ రెడ్డి, కోఆర్డినేటర్ రాంబాబు, డీన్ శ్రీనివాస్, రజిత, స్రవంతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ఝాన్సీ జన్మదిన వేడుకలు
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


