రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు శ్రీ ఆదర్శవాణి విద్యార్థులు
కాకతీయ, దుగ్గొండి: రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు శ్రీ ఆదర్శవాణి విద్యార్థులు ఎంపికైనట్లు విద్యా సంస్థల చైర్మన్ నాగనబోయిన రవి ఒక ప్రకటనలో తెలిపారు. 20వ తేదీన ములుగు జిల్లాలో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలలో పాఠశాలకు చెందిన విద్యార్థులు కట్కూరి ప్రణీత్, వారణాసి క్రాంతి లు అత్యుత్తమ ప్రతిభ కనబరచి ప్రధమ స్థానాన్ని కైవసం చేసుకొని రాష్ట్ర స్థాయికి ఎంపికయారన్నారు. ఈ సందర్బంగా చైర్మన్ రవి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో మెలగాలని క్రీడలతో మానసిక ఉల్లాసం, ఉత్సాహం, శారీరత్వం దృఢత్వం కలిగి ఉంటారని, చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ కవిత బిక్షపతి, ప్రిన్సిపాల్ స్రవంతి, రెజ్లింగ్ కోచ్ దేవేందర్, ఆరెల్లి చందన పిఈటిలు, క్రీడాకారులు పాల్గొన్నారు.


