క్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయి
కొత్తగూడెం ప్రగతి మైదానంలో క్రికెట్ పోటీలు ప్రారంభం
రాజ్యసభ సభ్యులు వద్దిరాజ్ రవిచంద్ర
కాకతీయ, కొత్తగూడెం : క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయని రాజ్యసభ సభ్యులు వద్దిరాజ్ రవిచంద్ర అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో గాయత్రీ క్రికెట్ మెమోరియల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనడం వల్ల దేహదారుఢ్యం పెరుగుతుందని, ఆరోగ్యవంతమైన జీవనానికి తోడ్పడుతుందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. క్రీడారంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని, కృషితో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. భారత క్రికెట్ జట్టు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తోందని కొనియాడారు. పోటీల ప్రారంభానికి వచ్చిన ఎంపీకి యువకులు ఘన స్వాగతం పలికారు. అమరవీరుల స్థూపానికి పూలమాలలు అర్పించారు. ఎంపీ టాస్ వేసి బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దిండిగల రాజేందర్, వనమా రాఘవ, కాపు సీతామహాలక్ష్మీ, ఆకుల గాంధీ, ఏనుగుల రాకేష్ రెడ్డి, రంగనాథ్, బాదావత్ శాంతి నాయక్, మల్హోత్రా సాగర్, కాలేరు సింధూ తపస్వి, బొమ్మిడి రమాకాంత్, బాదావత్ శ్రీకాంత్, నవతన్, బొమ్మిడి శ్రీకాంత్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.



