క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడతాయి
: వెలిగంటి రవి
కాకతీయ,వరంగల్ సిటీ : క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడతాయని జాగృతి నాయకుడు వెలిగంటి రవి తెలిపారు. ఖిలా వరంగల్ మైదానంలో సోమవారం జరిగిన రాణి రుద్రమదేవి ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్లో ప్రధాన అతిథిగా హాజరైన రవి, గెలుపు పొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఆర్.పి.ఎల్ సీజన్ ఫోర్‌లో మొత్తం 10 టీములు పాల్గొన్నాయి. ఇందులో ఓరుగల్లు వారియర్స్ బీజేతగా నిలిచారు. వారికీ 20,000 రూపాయల నగదు బహుమతి అందజేయడం జరిగింది. రవి ముఖ్యంగా యువతకు క్రీడల పట్ల ఉత్సాహం పెంచాలన్న సూచనతో మాట్లాడుతూ, ప్రస్తుతం కొన్ని యువత గంజాయి, డ్రగ్స్, మద్యపానంకు అలవాటు పడటం వల్ల వారి భవిష్యత్తు నాశనం అవుతోందని అన్నారు. అందుకు భద్ర మార్గం క్రీడల్లో ఆసక్తి చూపడం, మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందించడం అని ఆయన గుర్తుచేశారు.


