క్రీడలతోనే యువతకు మానసిక ఉల్లాసం
ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు
కాకతీయ, ఆత్మకూరు :యువతకు క్రీడల ద్వారానే మానసిక ఉల్లాసం, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని ఆత్మకూరు గ్రామ సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు అన్నారు. బోగి, సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో గ్రామస్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రోత్సాహంతోనే గ్రామస్థాయిలో కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. వారి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
క్రీడల్లో విజయం సాధించిన కుక్కల రమేష్, రజినీకాంత్ జట్లను సర్పంచ్ అభినందించి ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బయ్యా కుమార్, మండల యూత్ అధ్యక్షుడు తనుగుల సందీప్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గుండెబోయిన శ్యామ్, కాంగ్రెస్ నాయకులు సుగ్రీవ్, యూత్ నాయకులు వీరేందర్, నవీన్, రోహిత్, మణికంఠ, రజినీకాంత్, కక్కు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


