epaper
Friday, April 3, 2026
epaper

ఆత్మీయ అనుబంధాలు మాయం

ఆత్మీయ అనుబంధాలు మాయం

మనుషుల మధ్య పెరుగుతున్న వైష‌మ్యాలు

ప్రేమానురాగాల కంటే సంపాదనపైనే మోజు

ఉమ్మ‌డి కుటుంబాలు విచ్చిన్న‌మ‌వ‌డ‌మే కార‌ణం

మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

కొల్లాపూర్ నియోజకవర్గంలో ప‌ర్య‌ట‌న‌

ప్ర‌జ‌ల‌తో ముఖాముఖి..

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ఆధునిక యుగంలో నింగికి శాటిలైట్లు పంపుతున్నప్పటికీ, మనిషి కుటుంబ బంధాలను కాపాడుకోవడంలో వెనుకబడిపోతున్నాడని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ‌ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నద‌గడ గ్రామస్థులతో ముచ్చటించిన సందర్భంగా ఆయన సమాజంలో పెరుగుతున్న అంత‌రాలు, రైతు సమస్యలు, యువత పెడ ధోరణి, ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. నాడు తండ్రి మాట కోసం, తమ్ముడు భరతుని క్షేమం కోసం శ్రీరాముడు సంతోషంగా అడవుల బాట పట్టాడని, కుటుంబ గౌరవం కోసం త్యాగాలకు వెనుకాడని గొప్ప సంస్కృతి మనదని మంత్రి గుర్తు చేశారు. కానీ నేడు.. ఆత్మీయ అనుబంధాలు కనుమరుగవుతున్నాయని, ప్రేమానురాగాల కంటే సంపాదనపై మోజు పెరిగిపోతోందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆస్తి కోసం, స్వల్ప లాభాల కోసం తోడబుట్టిన వారి మధ్యే ద్వేషాలు పెరగడం దురదృష్టకరమ‌ని విచారం వ్య‌క్తం చేశారు.

ఆత్మహత్యల‌కు అదే కార‌ణం

నేడు సమాజంలో ఆత్మహత్యలు పెరగడానికి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం కూడా కార‌ణ‌మేనని మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు. ఒకప్పుడు ఇంట్లో పెద్ద దిక్కు ఉండేవారు. కష్టమొస్తే పంచుకోవడానికి, క‌ష్ట సుఖాల్ని పంచుకోవడానికి మనుషులు ఉండేవారు. నేడు ఏకాకి జీవితాల వల్ల, చిన్న సమస్య ఎదురైనా తట్టుకోలేక, చర్చించే వారు లేక ఆత్మహత్యల వైపు మళ్లుతున్నారని పేర్కొన్నారు.
అప్పుల బాధ, చిన్నపాటి మనస్పర్థలు ప్రాణాలు తీసుకునేంత పెద్దవి కావని, అందరూ కలిసి ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని ఆయన గ్రామస్తులకు హితోప‌దేశం చేశారు. మనం నింగిలోకి శాటిలైట్లను పంపుతూ అంతరిక్షాన్ని జయిస్తున్నాం.. కానీ, అదే ఆధునిక కాలంలో నదీ జలాలను పక్కనే ఉన్న పంట పొలాలకు మళ్లించలేకపోతున్నాం అని మంత్రి శాస్త్రీయ ప్రగతికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు మధ్య ఉన్న అంతరాన్ని ఎత్తి చూపారు. రైతులకు భరోసా అందించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. సమాజంలో కుటుంబ‌, నైతిక విలువలు క్షీణించే కొద్దీ సామాజిక సంఘర్షణ, సామాజిక అశాంతి పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని అన్నారు. అందువల్ల సమాజంలో నెల‌కొన్న అనేక సామాజిక రుగ్మ‌త‌ల‌ను రూపుమాపి ప్ర‌జ‌ల్లో వాటిపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌భాత‌భేరి అనే సామాజిక చైత‌న్య కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేసిన‌ట్లు తెలిపారు.

ప్రజలతో ముఖాముఖి

కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నదగడ, అమ్మాయిపల్లి గ్రామాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలు, జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై మంత్రి స్థానిక అధికారులు, ప్రజలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ప్రజలు తమ గ్రామ సమస్యలను మంత్రికి వివరించారు.
వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, నాణ్యతలో ఎలాంటి రాజీ పడవద్దని సూచించారు. సంక్షేమ పథకాల అమలు పారదర్శకంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ప్రయోజనాలు చేరేలా కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించడంలో అధికారులు చురుకుగా వ్యవహరించాలని మంత్రి జూపల్లి సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

లెక్చరర్ పోస్టుల్లో అక్రమాలకు కుట్ర

లెక్చరర్ పోస్టుల్లో అక్రమాలకు కుట్ర యువతకు ఉద్యోగాలు దక్కకుండా ప్రభుత్వం అడ్డంకులు తమవారికే కొలువులు...

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానం

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానం హ్యామ్ మోడల్ రోడ్లకు రూ. 13 వేల...

సీఐడీ ఎంక్వైరీతో లాభ‌మేంటి?

సీఐడీ ఎంక్వైరీతో లాభ‌మేంటి? మంత్రిని అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంటుందా? పొంగులేటి మంత్రి పదవికి...

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన క‌లిగి ఉండాలి

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన క‌లిగి ఉండాలి అల్లు అర్జున్ ఫ్యాన్స్ సామాజిక సేవ...

వైన్స్‌లకు దేవుడి పేర్లు తీసేయండి

వైన్స్‌లకు దేవుడి పేర్లు తీసేయండి భ‌గ‌వంతుడి పేర్లు పెట్టకుండా చట్టాలు తీసుకురావాలి లైసెన్సులు ఇచ్చే...

9 లక్షల 45 వేల మందికి ఆరోగ్యశ్రీ

9 లక్షల 45 వేల మందికి ఆరోగ్యశ్రీ.. ఏడాదికి 4 లక్షల మందికి...

ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించాలి

ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించాలి బిల్లులు రాక ద‌వాఖాన‌లు మూత‌బ‌డే ప‌రిస్థితి మేజర్ సర్జరీలకు...

ఏసీబీకి పట్టుబడిన మామడ ఎస్సై

ఏసీబీకి పట్టుబడిన మామడ ఎస్సై .. రూ. 20 వేలు తీసుకుంటూ దొరికిపోయిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img