నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ
కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా అవకాశం కల్పించిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తో పాటు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లకు నూతి సత్యనారాయణ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా మాట్లాడుతూ… డీసీసీ అధ్యక్షులుగా పదవీ బాధ్యత చేపట్టే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరై ఆశీర్వదించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియ జేశారు. అంతేకాకుండా శాసనసభ సభ్యులు మాలోతు రాందాస్ నాయక్, మట్టా రాగమయి , మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, పీసీసీ సభ్యులు అధ్యక్షులు మహ్మద్ జావేద్ కు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరికి, కార్పొరేషన్ లు చైర్మన్ లు రాయల నాగేశ్వర్ రావు, నాయుడు సత్యనారాయణ,శాసనసభ మాజీ సభ్యులు కొండబాల కోటేశ్వరరావు, శాసనమండలి మాజీ సభ్యులు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పులిపాటి వెంకయ్య కు, బ్లాక్, మండల, పట్టణ అధ్యక్షులకు అనుబంధ సంఘ అధ్యక్షులకు, పెద్ద ఎత్తున హాజరైన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్ కంచుకోట అని స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో మారు రుజువు చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పథకాలు నేడు సజీవ సాక్షాలుగా ఉన్నాయని గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ అభ్యర్థి తోనే సాధ్యం అవుతుందని అన్నారు. అత్యధిక పంచాయతీలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాను రోల్ మోడల్ గా మరోసారి నిలపాలని కోరారు.


