ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో శనివారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మునిసిపాలిటీ పరిధిలోని 1, 3, 6, 9, 25 వార్డుల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో మురికికాలువలను శుభ్రపరచడంతో పాటు చెత్త చెదారాన్ని తొలగించారు. మోడల్ చెరువు కట్ట వెంబడి, మెట్లపై పేరుకుపోయిన చెత్తను కూడా పారిశుద్ధ్య సిబ్బంది తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. చైర్‌పర్సన్ రోంటాల సుహాసిని, కమిషనర్ ముసాబ్ అహ్మద్ సయ్యద్, మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, వార్డు అధికారులు, శానిటరీ జవాన్లు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.


