రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలో ప్రత్యేక పూజలు.
నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రజిత రెడ్డి.
కాకతీయ, కరీంనగర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రజిత రెడ్డి ఆధ్వర్యంలో శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు సూచనలతో, జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నా రెడ్డి అనుమతితో ఈ కార్యక్రమం జరిగింది.సీఎం ఆరోగ్యం, దీర్ఘాయుష్కు కోసం ప్రార్థనలు చేశారు.
మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నగర మహిళా కాంగ్రెస్ వైస్‌ప్రెసిడెంట్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


