బాలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
•జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
కాకతీయ, మంచిర్యాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బాలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలిసి సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనాధ,పనులు చేసే పిల్లలను గుర్తించివసతి గృహాలలో చేర్పించాలని కోరారు. చైల్డ్ హెల్ప్ లైన్ అందే ప్రతి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పేర్కొన్నారు. అలాగే ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో కొనసాగుతున్న ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణ పనులను ఆకస్మికంగా సందర్శించారు. కాగా జనగణన కార్యక్రమంలో బాగంగా చేపట్టే ఇండ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోళీకరి అధ్యక్షతన నిర్వహించిన విడియో సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. మే 11 నుంచి జూన్ 9 తేదీ వరకు ఇండ్ల గణన కార్యక్రమం కొనసాగుతుందని,కుటుంబాల వివరాలు పూర్తిగా నమోదు చేయాలని పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


