25వ వార్డులో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీలక్ష్మీ రామానంద్
కాకతీయ,నర్సంపేట టౌన్ : నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డును మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్, కమిషనర్ కాటం భాస్కర్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా సందర్శించారు. వార్డులో రోడ్లు, డ్రైనేజ్, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువల నిర్మాణం త్వరలో చేపడతామని తెలిపారు. అవసరమైన చోట కల్వర్టులు నిర్మించి మురుగునీటి పారుదల సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మురుగు కాలువల్లో చెత్త పేరుకుపోవడం వల్ల దోమల సమస్య పెరుగుతోందని, కాలువలను తరచూ శుభ్రపరచి చెత్తను డంపింగ్ యార్డ్‌కు తరలించాలని సిబ్బందికి ఆదేశించారు. ఇంటింటికీ చెత్త సేకరణ క్రమబద్ధంగా నిర్వహించాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కటా ప్రభాకర్, వార్డు యువకులు కటా అఖిల్, కిసరి రాజు, నల్గొండ వంశీ, పుట్ట జగదీష్, చీకటి శివమణి, సాయి పటేల్, వార్డు ఆఫీసర్ సుష్మ, టౌన్ వాటర్ సప్లై ఇంచార్జ్ కాట శ్రీను, వార్డు జవాన్ మాదాసి శ్రీను, నాతి రాజు, టౌన్ ప్లానింగ్ అధికారి పొదిల్ల అనిల్ తదితరులు పాల్గొన్నారు.


