నంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్
కాకతీయ ఖమ్మం టౌన్ : ద్విచక్ర వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. నగరంలో సరైన నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ ద్వారా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చైన్ స్నాచింగ్ వంటి నేరాలు పాల్పడి తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్ లేకుండా తిరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు పర్యవేక్షణలో ముమ్మర తనిఖీ చెప్పటారు. సరైన నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ వద్ద వాహనదారులకు 14 వేల రూపాయలు, రాంగ్/ అపోజిట్ డ్రవింగ్ చేస్తున్న వాహనాలకు 17 వందల రూపాయలు వరకు జరిమానా విధించి, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించి, సరైన నెంబర్ ప్లేట్లు తెచ్చుకొని అమర్చిన వాహనాలకు వెసులుబాటు కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం నిర్లక్ష్యంగా రోడ్లపై వాహనాలు నిలపడం ద్వారానే జరుగుతున్నాయని, అదేవిదంగా మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని, రోడ్లపై తిరిగే వాహనాలకు తప్పనిసరిగా అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉండాలని, ప్రతీ వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. పెండింగ్ ఛానళ్లు చెల్లించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్న ట్రాఫిక్ నిబంధనలకు ప్రజలు సహకరించాలని కోరారు.


