ఆన్లైన్ టాస్కులపై ప్రత్యేక దృష్టి సారించాలి
కాకతీయ, నెల్లికుదురు : విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు సంబందిత ఆన్లైన్ టాస్కులపై కూడా ప్రత్యేత దృష్టిసారిస్తు మండలాన్ని ముందంజలో ఉంచాలని మండల విద్యాశాఖ అధికారి ఏ.రాందాస్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రతీరోజు విద్యార్థులు, ఉపాధ్యాయుల ఎస్ఆర్ఎస్ అటెండనన్స్ను సకాలంలో ఆన్లైన్ చేయాలని తదుపరి వెంటనే ఎండిఎం ఆన్లైన్ చేయాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న ఎఫ్ఎల్ఎన్, ఎల్ఎపీ బేస్లైన్, మిడ్లైన్ ఆన్లైన్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని తెలిపారు. ప్రతీ పాఠశాలలో హెచ్ఎం టేబుల్పై ఎఫ్ఎల్ఎస్ ప్రణాళికను సిద్దంగా ఉండాలని తెలిపారు. ఉన్నత అధికారులు పర్యవేక్షణలో ఆ ప్రశాళికపై ప్రత్యేక దృష్టిసారిస్తారని తెలిపారు. పదో తరగతి విద్యార్థులు నిర్దేశించి షెడ్యూల్ మేరకు ప్రక్టీస్ టెస్టులు నిర్వహించాలని, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేకర దృష్టి సారించి వారిలో నైపణ్యాలను పెంపోందించాలని తెలిపారు. అనంంతరం పాఠశాలలకు జనవరి మాసం రాగిజావ, బెల్లం ప్యాకెట్లను, 3, 10వ తరగతి విద్యార్థులకు అభ్యసదిపికలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గంగు వాణిశ్రీ, స్వప్న, గోజిటెడ్ హెచ్ఎంలు స్వరూప, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఉపేందర్ రావు, కేజీబీవీ ఎస్వి సుమలత, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు బాస్కర్ రావు, బీ, వీరస్వామి, బీ.కవిత, జే. కవిత, డీ.రవి, మెస్సెంజర్ యాకయ్య తదితరులు పాల్గొన్నారు.


