ముగిసిన ఎస్ అండ్ పీసీ శిక్షణ తరగతులు
కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి వ్యాప్తంగా గల ఎస్అండ్ పీసీ జమేదార్లకు విడతల వారీగా నిర్వహించే పునశ్చరణ శిక్షణ తరగతులలో భాగంగా ఈనెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కొత్తగూడెం ఎస్ అండ్ పీసీ ట్రైనింగ్ సెంటర్ నందు నిర్వహించిన 13వ జమేదార్ల పున:శ్చరణ శిక్షణా తరగతులు శనివారంతో విజయవంతంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రైనింగ్ అధికారి ఎండి.జాకీర్ హుస్సేన్ పాల్గొని ప్రసంగించారు. సెక్యూరిటీ సిబ్బంది అందరికీ క్రమశిక్షణ అనేది ముఖ్యమని మనం క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్నపుడే మనకు గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. జమేదార్లు ఫ్రంట్ లైన్ సూపర్ వైజర్ గా కీలకపాత్ర పోషిస్తారని ఎస్ అండ్ పిసి ప్రధాన విధులలో సెక్యూరిటీ సిబ్బంది అందరూ డ్రెస్ డ్యూటీ హానర్ కోడ్ కఠినంగా పాటించేలా చూడాలని తెలిపారు. రోజువారి సెక్యూరిటీ సిబ్బంది విధులను మానిటరింగ్ చేస్తూ సరియైన రిపోర్టుపై అధికారులకు అందజేయాలని సెక్యూరిటీ గార్డులు అందరిలో సత్ప్రవర్తన పొందేలా చూడాలని నీతి నిజాయితీతో క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శవంతంగా ఉండాలని తెలిపారు. జమేదారులు అందరిచే శ్రీ జ్యోతి అనాధ వృద్ధుల శరణాలయానికి నిత్యవసరాలను వితరణ గావించారు. అనంతరం ఉత్తమ ట్రైనీలుగా ఎంపిక కాబడిన బి.దేవారెడ్డి, పి.మొండయ్య,
వై.శ్రీనివాస్ కు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో డి.నారాయణరెడ్డి ట్రైనింగ్ ఇన్ స్పెక్టర్, ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.


