కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని నెల్లికుదురు, శ్రీరామగిరి పిఎసిఎస్ తదితర యూరియా పంపిణీ సెంటర్లను గురువారం ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పర్యటించి తనిఖీలు నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధ్రువ పత్రాలను పరిశీలించి టోకెన్ల ప్రకారం వెంట వెంటనే బస్తాలను పంపిణీ చేయాలని పంపిణీ చేసే అధికారులకు సూచించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా క్రమ పద్ధతిలో రైతులు నిల్చని బస్తాలను తీసుకునే విధంగా రైతులు అధైర్య పడకుండా వ్యవసాయ శాఖకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.


