ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు
వెన్నెం రజిత ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
కాకతీయ, కరీంనగర్ : కాంగ్రెస్ అగ్రనేత, తెలంగాణ ప్రజలకు స్వరాణిమ రోజులు అందించిన నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నగర మహిళా కాంగ్రెస్ ఘనంగా నిర్వహించింది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెన్నెం రజితారెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్‌రోడ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి సోనియా దీర్ఘాయుష్షు, ప్రజాసేవ కొనసాగాలని ప్రార్థించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలతో కలిసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సోనియా గాంధీ నాయకత్వమే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం దక్కేలా చేశిందని, ఆమె నిర్ణయాలతో కోట్లాది ప్రజల జీవితం మారిందని పేర్కొన్నారు.మహిళల సాధికారత, పేదల సంక్షేమం కోసం సోనియా ప్రవేశపెట్టిన పథకాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి అని గుర్తుచేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆకారపూ భాస్కర్ రెడ్డి, గన్ను మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. నగర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై జయంతి వేడుకలకు ప్రత్యేక రీతిలో శోభనందించారు.


