కాకతీయ, వెంకటాపురం: ఇప్పలగూడెం గ్రామం గురువారం ఒక కుటుంబంలో నెలకొన్న వివాదం చివరకు రక్తపాతం వరకు దారితీసింది. సొంత అత్త కొండ గొర్ల ఎల్లమ్మ (వయసు 50) పై అల్లుడు విజయ్ దాడి చేసి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. పోలీసులు, గ్రామస్తుల సమాచారం ప్రకారం మద్యం మత్తులో ఉన్న విజయ్, తన అత్తపై గొడ్డలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
గ్రామంలో స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, కొంతకాలంగా కుటుంబంలో చిన్నచిన్న వివాదాలు ఉన్నాయని, పరిస్థితి అదుపు తప్పి విజయ్ తన అత్తపైబి ఒక్కసారిగా గొడ్డలితో దాడి చేశాడు అని తెలిపారు. ఘటనా స్థలానికి వెంటనే వెంకటాపురం పోలీసులు చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల అసలు కారణం తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


