కాకతీయ, నేషనల్ డెస్క్: కొద్దిగంటల్లో తండ్రి మృతదేహానికి చితి పెట్టాల్సిన కొడుకు అంతలోనే తనువు చాలించాడు. ఏ ఆసుపత్రి నుంచి తండ్రి డెడ్ బాడీ తీసుకుని ఇంటికి వస్తున్నాడో చివరి అదే ఆసుపత్రి సమీపంలో మ్రుత్యు ఒడిలోకి జారుకున్నాడు. అంబులెన్స్ లో తండ్రి డెడ్ బాడీని తరలిస్తున్న ఆయనను రోడ్డు ప్రమాదంలో మ్రుత్యువు బలి తీసుకుంది. బాధిత కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఈ ఘటన మయూర్ భంజ్ లో ఆదివారం సాయంత్రం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఠకుర్ ముండా సమితి మితువాని గ్రామానికి చెందిన గోపబంధు నాయక్ గుండెనొప్పి రావడంతో ఆయన కుమారు శుభ్ నాయక్ కటక్ లోని ఎస్సీబీ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్ పొందుతూ తండ్రి మరణించాడు. ఆయన డెడ్ బాడీని అంబులెన్స్ లో స్వగ్రామానికి శుభ్ నాయక్ తీసుకువస్తున్నాడు. మాధాపూర్ సమీపంలో నీళ్లు తాగేందుకు అంబులెన్స్ నుంచి కిందకు దిగిన అతన్ని వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కాళ్లు, చేతికి తీవ్రగాయాలైన శుభ్ ను జాజ్ పూర్ రోడ్డు ఆసుపత్రిలో చేర్చించారు. మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు ఎస్సీబీ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆసుపత్రి సమీపంలో మరణించాడు. కొన్నిగంటల వ్యవధిలో తండ్రి కుమాడు మరణించడం బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.


