- తక్షణం స్పందించిన మాజీ మేయర్ సునీల్‌రావు
కాకతీయ, కరీంనగర్ : నగరంలోని భగత్‌నగర్ పెద్దమ్మ తల్లి దేవాలయం సమీపంలో డ్రైనేజి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఊరట లభించింది. సమస్యను స్థానికులు మాజీ మేయర్, బీజేపీ నాయకుడు యాదగిరి సునీల్‌రావు దృష్టికి తీసుకురాగానే ఆయన వెంటనే స్పందించారు. సునీల్‌రావు స్వయంగా ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించి, మునిసిపల్ అధికారులతో మాట్లాడి అవసరమైన పనులను తక్షణమే ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ఆయన పర్యవేక్షణలో అధికారులు వెంటనే డ్రైనేజి మరమ్మతు పనులు ప్రారంభించగా, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.


