రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
కాకతీయ, కరీంనగర్ రూరల్: మానకొండూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన పోతర్ల అశోక్ (31) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ఇరుకుల్ల వైపు నుంచి కరీంనగర్‌కు పల్సర్ ద్విచక్ర వాహనంపై వస్తుండగా, ఎదురుగా వచ్చిన లారీ అకస్మాత్తుగా ఎడమవైపు తిరగడంతో అశోక్ వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతనికి తల, ఛాతీ, మెడ భాగాల్లో తీవ్ర గాయాలు అయ్యాయి. యపడిన అశోక్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అనంతరం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించారు.
మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీ డ్రైవర్‌ను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


