కాకతీయ, నేషనల్ డెస్క్: మూడు సంవత్సరాల క్రితం ఉజ్బెకిస్తాన్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్తాన్ ప్రాధిని షెహబాజ్ షరీఫ్ సమావేశం అయ్యారు. ఆ సందర్బంలో షరీఫ్ తన చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకునేందుకు నానా తంటాలు పడిన సీన్ అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. తాజాగా చైనాలో నిర్వహించిన షాంఘై సహకార సదస్సు సందర్భంగా అదే సీన్ మరోసారి రిపీట్ అయ్యింది.
పుతిన్ తన ఇయర్ ఫోన్ పెట్టుకుని భేటీకి సిద్ధంగా ఉండగా పాకిస్తాన్ ప్రధాని ఆపోసోపాలు పడాల్సి వచ్చింది. దీంతో పక్కన ఉన్న అధికారులు ఆయనకు సాయం చేయాల్సి వచ్చింది. ఒక దశలో పుతిన్ తన చెవిలోని ఇయర్ ఫోన్ తీసి మరీ ఇదిగో ఇలా పెట్టుకోవాలని నవ్వుతూ చూపించారు. అంతర్జాతీయ వేదికపై ఎదుటి నేత గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేశారు.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. బీజింగ్ లో షెహబాజ్ షరీఫ్ ఇయర్ ఫోన్ జారిపోయింది. పుతిన్ కు ఆ విషయం తెగ నవ్వు తెప్పించిందంటూ ఓ యూజర్ ఎక్స్ లో పోస్టు చేశారు. 2022లో ఉజ్బెకిస్తాన్ పర్యటన సందర్భంగా పుతిన్ తో భేటీకి ముందు షరీఫ్ కు ఇలాంటి అనుభవం ఎదురైంది. ఇయర్ ఫోన్ ధరిస్తుండగానే పడిపోతుంటే పక్కనున్న అధికారులు సహాయం చేశారు. ఈ ఘటనపై పలువురు విదేశీ ప్రముఖులతోపాటు పాకిస్తాన్ లోని ప్రతిపక్ష నేతలు కూడా ఎద్దేవా చేశారు. 22కోట్ల మంది పాకిస్తాన్ ప్రజలకు ఈ షెహబాజ్ షరీఫ్ ప్రధాని అంటే ఆశ్చర్యం కలుగుతోందంటూ అప్పట్లో కమెడియన్ జిమ్మీ ఫాలన్ కామెడీ చేశారు.
కాగా ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు చైనాలోని తియాన్ జెన్ లో షాంఘై సహకార సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ మీమ్ మేకర్ గా మారారు. భారత ప్రధాని మోదీ , రష్యా అధ్యక్షుడు పుతిన్ ముచ్చట్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే షరీఫ్ చేతులు కట్టుకుని అలా చూస్తూ ఉండిపోవడం వైరల్ గా మారింది.
Watch: Pakistani PM Shehbaz Sharif’s headphone fumble during his meeting with President Putin in Beijing went viral yet again Putin was seen smiling and trying to help as Sharif struggled with his headset at the SCO Summit. The episode echoed previous headphone mishaps, sparking… pic.twitter.com/AgVAmjHxr2
— Defence Chronicle India ™ (@TheDCIndia) September 3, 2025


