జాతీయ రంగోత్సవ్‌లో స్మార్ట్ కిడ్జ్ చిన్నారుల సత్తా
కాకతీయ, ఖమ్మం : జాతీయ స్థాయి రంగోత్సవ్ హ్యాండ్‌రైటింగ్, కలరింగ్ పోటీల్లో ఖమ్మంలోని స్మార్ట్ కిడ్జ్ పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన వివిధ తరగతుల విద్యార్థులు మొత్తం 39 మంది జాతీయ స్థాయి పోటీల్లో బహుమతులు సాధించడం విశేషంగా నిలిచింది. విజయం సాధించిన విద్యార్థులకు సోమవారం పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మెడల్స్ అందజేసి అభినందించారు. మెడల్స్ సాధించిన విద్యార్థుల్లో లాస్య ప్రియ, వేధన్య, మోక్షిత్ కృష్ణ, మనీష్, పునర్వి, యోగితారెడ్డి, ప్రణీత శ్రీ, జస్విక్, స్వీకృతి, గాత్రి, అభయ్ కృష్ణ, సాయి స్కందన్, నిరూప, ప్రహాసిని, ధన్విక్, ధాత్రి శ్రీ, కార్తీ సుదీక్ష, సాయిష్, యక్షిత్, వీక్ష, మోక్షశ్రీ, ముబీనలి, చతుర్వేద్, ఆద్య, సహస్ర, దీపక్, హర్షిత, రిషాన్ జాదవ్, పవిత్ర, యశస్విని తదితరులు ఉన్నారు.
అంతర్జాతీయ స్థాయికి ఎంపిక అభినందనీయం
ఈ సందర్భంగా కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ, రంగోత్సవ్ జాతీయస్థాయి పోటీల్లో మెడల్స్ సాధించి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకే గర్వకారణమన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాదీ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తూ పాఠశాల ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్నారని తెలిపారు. చదువుతోపాటు విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అందుకే ఉన్నత స్థాయి పోటీల్లో స్మార్ట్ కిడ్జ్ విద్యార్థులు విజయాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


