కాకతీయ, క్రైమ్ బ్యూరో: కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. నీటి కుంటలో ఈతకు దిగిన ఆరుగురు చిన్నారులు మరణించారు. ఆస్పరి మండలం చిగలి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు గ్రామశివారులతో కొండ ప్రాంతంలో ఉన్న కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఇటీవల కురిసిన భారీ వర్షాకలు కుంటలో భారీగా నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలోనే కుంటలో ఈతకు దిగిన విద్యార్థుల్లో ఆరుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరో విద్యార్థి గ్రామంలోని వెళ్లి ప్రమాదం విషయం తెలిపారు. ఆరుగురు చిన్నారులు మరణించడంతో చిగలి గ్రామంలో విషాదం అలుముకుంది.
విషాదం..నీటి కుంటలో దిగి ఆరుగురు చిన్నారులు మృతి ..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


