epaper
Monday, March 2, 2026
epaper

కేసీఆర్‌ను విచారించనున్న సిట్

కేసీఆర్‌ను విచారించనున్న సిట్
మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లో విచార‌ణ ఆరంభం
ఎర్రవల్లి నుంచి భారీ కాన్వాయ్‌తో బయల్దేరిన కేసీఆర్
నివాసంలోని రెండో అంతస్తులోనే విచారణ
విచారణ స‌మ‌యంలో గదిలో కేసీఆర్‌తో పాటు ఎవ‌రికి అనుమ‌తి లేదు
వీడియో రికార్డింగ్‌కు ఏర్పాట్లు

కాకతీయ, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి *కేసీఆర్*ను విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ఫిబ్రవరి 1, 2026 (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ముందుగా ఖరారు చేసిన ప్రకారం కేసీఆర్ నివాసంలోని రెండో అంతస్తులోనే సిట్ విచారణ కొనసాగనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ నుంచి భారీ కాన్వాయ్‌తో నందినగర్ నివాసానికి బయల్దేరినట్లు తెలిసింది. భద్రతా ఏర్పాట్ల మధ్య ఆయన నివాసానికి చేరుకున్నారు. విచారణ సమయంలో ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా సిట్ అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. నందినగర్ నివాసంలోకి పార్టీ నేతలు, ఇతర సిబ్బందికి పూర్తిగా అనుమతి నిరాకరించారు. భద్రతా, గోప్యతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

కేసీఆర్‌కే మాత్రమే అనుమతి

సిట్ ఏర్పాటు చేసిన విచారణ గదిలోకి కేసీఆర్ ఒక్కరినే అనుమతించే అవకాశం ఉందని సమాచారం. విచారణ సమయంలో ఎవరూ లోపలికి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే కుటుంబ సభ్యులైన హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులకు మాత్రమే నివాసంలో ఉండేందుకు అనుమతి ఇచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. విచారణ మొత్తం పారదర్శకంగా సాగేందుకు ప్రతి దశను వీడియో రికార్డ్ చేయనున్నట్లు సిట్ వర్గాలు వెల్లడించాయి. ప్రశ్నలు, సమాధానాలు అన్నింటినీ రికార్డుల్లో భద్రపరచనున్నారు. భవిష్యత్ న్యాయపరమైన అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విచారణ నేపథ్యంలో నందినగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి నిరసనలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అంతకుముందు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విచారణ జరపాలని కేసీఆర్ సూచించినప్పటికీ, సున్నితమైన ఎలక్ట్రానిక్ ఆధారాలను అక్కడికి తరలించడం కష్టమని సిట్ అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో నందినగర్ నివాసంలోనే విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. సిట్ విచారణ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ విచారణ ఎలాంటి మలుపు తిరుగుతుందన్న దానిపై రాజకీయంగా విస్తృత చర్చ కొనసాగుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

శుక్రవారం సభలతో ప్రజారోగ్యంపై కచ్చితమైన పర్యవేక్షణ

శుక్రవారం సభలతో ప్రజారోగ్యంపై కచ్చితమైన పర్యవేక్షణ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్...

బీఆర్ ఎస్ ఖాతాలో తొర్రూరు మునిసిపాలిటీ

బీఆర్ ఎస్ ఖాతాలో తొర్రూరు మునిసిపాలిటీ 16లో 9 వార్డుల్లో బీఆర్‌ఎస్ విజయం 7...

కార్పొరేషన్ ఎన్నికల్లో “కారు” స్పీడ్ పెంచాలి

కార్పొరేషన్ ఎన్నికల్లో "కారు" స్పీడ్ పెంచాలి కాంగ్రెస్ బాకీ కార్డును ప్రజల వద్దకు...

రైతు ఐడీ తప్పనిసరి!

రైతు ఐడీ తప్పనిసరి! 2026 నుంచి పీఎం కిసాన్ లబ్ధికి షరతు అగ్రిస్టాక్‌తో డిజిటల్...

మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలి క్యూ లైన్...

అలుగునూర్ చౌరస్తాలో ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదం

అలుగునూర్ చౌరస్తాలో ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్న స్థానికులు కాకతీయ, కరీంనగర్...

నూతన సర్పంచ్ రాధిక శ్రీనివాస్‌కు సన్మానం

నూతన సర్పంచ్ రాధిక శ్రీనివాస్‌కు సన్మానం కాకతీయ, గణపురం : మేజర్ గ్రామపంచాయతీ...

పీఎంవో ఆఫీస్ ఇక సేవాతీర్థ్..

పీఎంవో ఆఫీస్ ఇక సేవాతీర్థ్.. పేరు మార్చుతూ కేంద్రం నిర్ణయం కొత్త భవనంలోకి మారనున్న...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img