epaper
Monday, March 2, 2026
epaper

మొబైల్ రికవరీలో సిరిసిల్లకు దేశవ్యాప్త ఖ్యాతి!

మొబైల్ రికవరీలో సిరిసిల్లకు దేశవ్యాప్త ఖ్యాతి!
సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు వేగవంతమైన సేవలు
78 శాతం రికవరీతో దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానం
ఇప్పటివరకు 2,286 ఫోన్లు బాధితులకు అప్పగింత
జిల్లా పోలీసుల పనితీరును అభినందించిన రాష్ట్ర డీజీపీ
సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే హర్షం

కాకతీయ, రాజన్న సిరిసిల్ల : మొబైల్ ఫోన్ల రికవరీ విషయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంకేతిక వ్యవస్థను సమర్థంగా వినియోగిస్తూ 78 శాతం రికవరీ రేటు సాధించి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. ఆధునిక సాంకేతికతను ప్రజాసేవ కోసం సమర్థంగా ఉపయోగించి జిల్లా పోలీసు యంత్రాంగం విశేష విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. జిల్లాలో పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైళ్లపై వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తూ, ప్రత్యేక గుర్తింపు సంఖ్యల ఆధారంగా అన్వేషణ చేసి ఇప్పటివరకు 2,286 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేశారు. ఈ ఘనతతో సిరిసిల్ల జిల్లా పోలీసు శాఖ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

సాంకేతికతతో సమస్యలకు పరిష్కారం

మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే ప్రత్యేక విధానం ద్వారా అన్వేషణ ప్రారంభించి తక్కువ సమయంలోనే ఫోన్లను గుర్తిస్తున్నారు. వివిధ నెట్‌వర్క్ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ వేగంగా చర్యలు తీసుకోవడం వల్లే ఈ స్థాయి ఫలితాలు సాధ్యమయ్యాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే సిరిసిల్ల పోలీసులు ప్రజలకు అత్యంత వేగంగా సేవలు అందిస్తున్నారని ప్రశంసలు వస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి ప్రజలకు ఉపశమనం కలిగించడంలో జిల్లా పోలీసుల కృషి ఆదర్శంగా నిలుస్తోంది.

డీజీపీ ప్రశంసలు – జాతీయ స్థాయి పురస్కారం
ఈ ఘనతపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్ జిల్లా పోలీసు అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. మొబైల్ రికవరీలో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ ఆధ్వర్యంలో దక్షిణ భారత స్థాయిలో మొదటి స్థానం దక్కడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీన కేరళలోని ఎర్నాకులంలో జరగనున్న జాతీయ స్థాయి సదస్సులో జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పాల్గొని అవార్డును స్వీకరించనున్నారు. మొబైల్ ఫోన్ల రికవరీలో అనుసరించిన ఉత్తమ విధానాలు, విజయవంతమైన కార్యాచరణ వ్యూహాలను ఆ సమావేశంలో వివరించనున్నారు.

ఎస్పీ మహేష్ బి గితే హర్షం
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ, మొబైల్ రికవరీలో దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం తెలంగాణ పోలీసుల నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. ఫిర్యాదులు అందిన వెంటనే వేగంగా స్పందించడం, ఆధునిక సాంకేతిక విధానాలను పూర్తిస్థాయిలో వినియోగించడం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, అందుబాటులో ఉన్న ప్రభుత్వ సాంకేతిక సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. మొబైల్ రికవరీలో కీలకంగా పనిచేసిన ఐటీ విభాగం ఎస్‌ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ తిరుమలేష్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా పనిచేసిన అన్ని పోలీస్ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా ఉపయోగిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పోలీస్ శాఖ ముందుకు సాగుతుందని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img