epaper
Tuesday, April 7, 2026
epaper

ఎస్ఐఆర్ మ్యాపింగ్ వేగవంతం చేయాలి

ఎస్ఐఆర్ మ్యాపింగ్ వేగవంతం చేయాలి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
హ‌న్మ‌కొండ క‌లెక్ట‌రేట్‌లో ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష
జిల్లాలో 75 శాతం పూర్తైన ఎస్ఐఆర్ మ్యాపింగ్

కాకతీయ, హనుమకొండ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్ ) ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన బీహార్ అదనపు సీఈవో ప్రశాంత్ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో ఎస్ ఐ ఆర్ మ్యాపింగ్ పురోగతిపై సమీక్షించారు. ముఖ్యంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మ్యాపింగ్ శాతం తక్కువగా ఉండటంపై కారణాలను అడిగి తెలుసుకున్నారు. అర్బన్ ప్రాంతాల్లో మ్యాపింగ్ వేగవంతం చేయడానికి తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు. అధికారులతో మాట్లాడుతూ.. మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడానికి మున్సిపల్ సిబ్బంది, బూత్ లెవెల్ అధికారులు (బి ఎల్ ఓ లు) సమన్వయంతో పని చేయాలని సూచించారు. అలాగే బూత్ లెవెల్ ఏజెంట్ల (బి ఎల్ ఏ లు) జాబితాను రాజకీయ పార్టీల నుంచి సమర్పింపజేయాలని, బి ఎల్ ఓ లతో పాటు బి ఎల్ ఏ లు కూడా మ్యాపింగ్ ప్రక్రియలో పాల్గొనేలా చూడాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాలు, రేషన్ డీలర్ల సహకారాన్ని వినియోగించుకోవాలని, ఫిజికల్ ఎన్యుమరేషన్ ఫార్ముల పంపిణీని వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మ్యాపింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ఎస్ ఐ ఆర్ మ్యాపింగ్ 75 శాతం పూర్తయిందని తెలిపారు. సమావేశానికి ముందు కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్న సుదర్శన్ రెడ్డికి పోలీసులు గౌరవ వందనం సమర్పించగా, జిల్లా కలెక్టర్ మొక్కను అందించి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో బీహార్ రాష్ట్రంలో నిర్వహించిన ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో ఎదురైన సవాళ్లు, వాటి పరిష్కారాలపై ప్రశాంత్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. రవి, సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కన్నం నారాయణ, ఏసీపీ నరసింహరావు, జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులుగా అశోక్ గౌడ్

కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులుగా అశోక్ గౌడ్ కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని చిన్ననాగారం గ్రామానికి...

ఆహార భద్రతలో రాజీ పడొద్దు

ఆహార భద్రతలో రాజీ పడొద్దు నాణ్యమైన ఆహారంతోనే మెరుగైన ఆరోగ్యం గడువు తేదీలు తప్పనిసరిగా...

వేయి స్తంభాల ఆల‌య అభివృద్ధికి 14.44 కోట్లు మంజూరు

వేయి స్తంభాల ఆల‌య అభివృద్ధికి 14.44 కోట్లు మంజూరు కేంద్రం నిధులతో పునరుద్ధరణ...

అర కిలోమీటర్ రోడ్డులో అరవై గుంతలు

అర కిలోమీటర్ రోడ్డులో అరవై గుంతలు శంకుస్థాపన జరిగి రెండేళ్లైనా పనులు లేవు బీజేపీ...

రైతు లేనిదే రాజ్యం లేదు

రైతు లేనిదే రాజ్యం లేదు ప్రతి గింజకు ప్ర‌భుత్వం మద్దతు ధర రైతులు మధ్యవర్తులను...

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం..

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం.. కాకతీయ, గీసుగొండ: అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో...

కొత్త జీపీ భ‌వ‌నం ప్రారంభం

కొత్త జీపీ భ‌వ‌నం ప్రారంభం మూడు నెలల్లోనే వేగంగా నిర్మాణం పూర్తి సర్పంచ్...

ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు

ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు కాకతీయ, హనుమకొండ : మడికొండ చౌరస్తాలో భారతీయ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img