కలెక్టరేట్‌లో వందేమాతరం గేయాలాపన.
కాకతీయ, కరీంనగర్ : స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజల్లో జాతీయ స్పూర్తిని రగిలించిన వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టరేట్‌లో సామూహికంగా వందేమాతరం గేయాలాపన నిర్వహించారు.జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మి కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫూల్ దేశాయ్, డిఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, జిల్లా అధికారులు, సిబ్బంది గేయాలాపనలో పాల్గొన్నారు.


