ప్రపంచకప్‌లో వెండి పతకం
పవర్ లిఫ్టర్ ప్రదీప్ కుమార్‌కు మంత్రి అభినందనలు
కాకతీయ, మేడ్చల్ మల్కాజిగిరి : ఈజిప్ట్‌లోని కైరోలో జరిగిన పవర్ లిఫ్టింగ్ వరల్డ్ కప్ పోటీలలో మాస్టర్స్ విభాగంలో వెండి పతకం సాధించిన తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ గెజిటెడ్ అధికారి పెరుమాళ్ల ప్రదీప్ కుమార్‌ను క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందించారు.
మల్కాజ్గిరి కమిషనరేట్‌లో అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన ప్రదీప్ కుమార్ 82.5 కిలోల విభాగంలో 400 కిలోల బరువు ఎత్తి రెండో స్థానం సాధించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.


