చిన్ననాగారం సంతను ప్రారంభించిన ఎస్సై
కాకతీయ, ఇనుగుర్తి : మండలంలోని చిన్న నాగారం లో నూతనంగా ఏర్పాటు చేసిన అంగడి ని శనివారం ఎస్సై గంగారపు కరుణాకర్ సర్పంచ్ చెడుపాక సుజాత యాకన్న, ఉపసర్పంచ్ తుమ్మనపల్లి సతీష్ చారి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గ్రామం లోని చుట్టుపక్కల గ్రామంలోని ప్రజలకు అంగడిలో అన్ని సరుకులు అందుబాటులో ఉండే విధంగా సంతను ఏర్పాటు చేయడం అభినందనీయమని, అంగడి నిర్వాహకులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని గ్రామంలోని నూతన పాలక మండలి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ సంతను విజయవంతంగా ముందుకు నడిపించాలని ఎస్సై సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలకమండలి, జిల్లా, మండల నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు


