ఎస్ఐ చంద్రశేఖర్ భార్య ఆత్మహత్య
ఆత్మహత్యకు ముందు ఇద్దరి మధ్య వాగ్వాదం..ఘర్షణ
కరీంనగర్ పోలీస్ శాఖలో కలకలం..!
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో టూ టౌన్ ఎస్ ఐగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య దివ్య మంగళవారం ఉదయం పదిగంటల సమయంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్య భర్తల మధ్య నెలకొన్న కలహాలే దివ్య ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. దివ్య ఆత్మహత్యకు కొద్ది సమయం ముందు భార్య భర్తల మధ్య వాగ్వాదం.. ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దివ్య ఆత్మహత్యకు చంద్రశేఖరే కారణమంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. గన్నేరు పప్పుతో పాటు విషం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దివ్య స్వస్థలం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతం పేట స్వగ్రామం.



