కాకతీయ, గీసుగొండ: అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్న వ్యక్తిపై గీసుగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. సిఐ ఎ.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పోతురాజుపల్లి శివారు బోడు వద్ద ప్రభుత్వ నిషేధిత గుడుంబా తయారీ జరుగుతున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు ఎస్సై అనిల్ కుమార్ తన పోలీస్ బృందంతో దాడి చేసి గుడుంబా తయారీదారున్ని పట్టుకున్నారు.
నందనాయక్ తండాకు చెందిన భుక్య శంకర్ పోతురాజు పల్లి శివారులో రహస్యంగా గుడుంబా తయారు చేస్తున్నాడు. అతని వద్ద నుండి 40 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, సుమారు 800 లీటర్ల పానకాన్ని ధ్వంసం చేసినట్టు సీఐ తెలిపారు.
అతనిపై కేసు నమోదు చేసి,విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. స్థానికులు గుడుంబా వంటి నిషేధిత మద్యం తయారీ, విక్రయం కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ విజ్ఞప్తి చేశారు.


