శ్యామ్రావును భారీ మెజారిటీతో గెలిపించాలి :మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి: మల్లంపల్లి మేజర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ల్యాద శ్యామ్రావు కు భారీ మెజారిటీతో విజయం సాధింపజేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రజలను కోరారు. బుధవారం ఆమె మల్లంపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి తిరిగి ఎన్నికల వాతావరణాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం మల్లంపల్లి మండలం ఏర్పాటు చేశాం అని, కొత్తగా ఏర్పడిన ఈ మండలానికి మాజీ జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ పేరును పెట్టడం పట్ల ఆనందంగా ఉంది అని, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు గ్రామాల్లో వేగంగా కొనసాగుతున్నాయి అని,గ్రామం మరింత అభివృద్ధి చెందాలంటే లేడీ పర్సు గుర్తుకు ఓటేసి శ్యామ్రావును గెలిపించాలి అని ఆమె అన్నారు. స్థానిక ప్రజలతో కలిసిమెలిసి ఉండే గుణం, అందరినీ అండగా తీసుకుని పనిచేసే స్వభావం శ్యామ్రావును ప్రత్యేకంగా నిలబెడుతుందని మంత్రి పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి పథకాల అమలుకు ఆయన విజయం కీలకమని చెప్పారు. ప్రచారంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్, ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు చందా రాము, డా. రవిబాబు, రామకృష్ణ రెడ్డి, చిట్టిరెడ్డి రాంరెడ్డి, ఎడ్ల కరుణాకర్ రెడ్డి, మూల గణేష్ రెడ్డి, మూల వెంకటేశ్వర్లు, నందికొండ శ్రీనివాస్ రెడ్డి, చెరుకుపల్లి మల్లారెడ్డి, మాచర్ల రవి, ముత్యాల వెంకన్న, అహ్మద్ పాషా, గొల్న మొగిలివనమ వేణు, తాళ్లపల్లి సాంబయ్య, కక్కెర్ల సాంబయ్య, గుడెపు రాజిరెడ్డి, జనగాం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.



