స్టైలిష్ లుక్కుతో శ్రుతి సందడి
కాకతీయ, సినిమా : సంగీత ప్రియులను ఇటీవల “సంచారి” పాటతో ఆకట్టుకున్న శ్రుతి హాసన్ ఇప్పుడు మరో కొత్త పాట “పవళ మల్లి”తో అభిమానుల ముందుకు వచ్చారు. ఈ పాటకు సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ స్వరపరిచారు. ఆయనతో పాటు శ్రుతి హాసన్ కూడా పాటను ఆలపించారు. ఈ పాటలో నటి కయాడు వీడియోలో కనిపించారు. మెలోడీ టచ్‌తో ఉన్న ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా శ్రుతి హాసన్ గాత్రం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాట విడుదలతో పాటు శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో తన కొత్త ఫోటోలను కూడా షేర్ చేశారు. నలుపు రంగు దుస్తుల్లో ఆమె స్టైలిష్‌గా కనిపించారు. బ్లాక్ క్రాప్ టాప్, పొడవైన స్కర్ట్, ఎంబ్రాయిడరీ జాకెట్‌తో ఆమె లుక్ ఆకట్టుకుంది. ఎరుపు బ్యాక్‌గ్రౌండ్‌లో తీసిన ఈ ఫోటోలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే శ్రుతి హాసన్ తమిళంలో ట్రైన్, తెలుగులో ఆకాశంలో ఒక తారా చిత్రాల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా సలార్ పార్ట్ 2 సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంగీతం, సినిమాలు, ఫ్యాషన్‌తో శ్రుతి హాసన్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు.


