కాకతీయ, పెద్దపల్లి : న్యూఇండియా పార్టీకి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం 324, ప్రజా ప్రతినిధి చట్టం 1951, సెక్షన్ 29-ఎ ప్రకారం రిజిస్టర్డ్ పార్టీ విధిగా నియామక ఆడిట్ అకౌంట్స్ సమర్పించాలని, అయితే న్యూఇండియా పార్టీ 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాల ఆడిట్ అకౌంట్స్ వివరాలను సమర్పించకపోవడం వల్ల షోకాజ్ నోటీసు జారీ చేశారన్నారు.
ప్రతి పార్టీ వార్షిక ఆడిట్ అకౌంట్స్ రిపోర్ట్, ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను ప్రతియేటా సమర్పించడం తప్పనిసరి అని, సమర్పించని పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా షోకాజ్ నోటీసును ఇచ్చామని, పార్టీ అధికారి లేదా ప్రతినిధి నిర్దిష్ట సమయం లోపు సమాధానం ఇవ్వాలని తెలిపారు. పార్టీ వారి సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని, స్పందించకపోతే గుర్తింపు రద్దు చేసే అవకాశముందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వివరణ ఇవ్వకుండా వున్న ప్రకటనలను దృష్టిలో పెట్టుకుని న్యూఇండియా పార్టీకి ఈ షోకాజ్ నోటీసు జారీ చేశారని, పార్టీ గుర్తింపునకు సంబంధించిన వివరణకు తదుపరి దశల్లో తగిన చర్యలు తీసుకుంటారని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


