- విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాసరచన..
- ఔత్సాహికులు ఎవరైనా పాల్గొనవచ్చు
- అక్టోబర్ 21 ఫ్లాగ్ డే సందర్భంగా నిర్వహణ
- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
కాకతీయ, ఆదిలాబాద్ : అక్టోబర్ 21 అమరవీరుల దినోత్సవం (ఫ్లాగ్ డే) సందర్భంగా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీసులు చేసిన సేవలకు సంబంధించిన ఫోటోలు లేదా రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాలలో పోలీసుల సేవ, ఇతర పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలపై మూడు నిమిషాలకు తగ్గించకుండా షార్ట్ వీడియోలను రూపొందించాలన్నారు. పోలీసులు చేసిన సేవల ఫోటోలను అందించాలని సూచించారు. ప్రతిభ కనబరిచిన మొదటి మూడు ఫోటోలను, వీడియోలకు బహుమతి ప్రధానం చేస్తూ, రాష్ట్ర పోటీల్లో పాల్గొనే విధంగా అర్హత లభిస్తుందని తెలియజేశారు. ఈ ఫోటోలను, వీడియోలను అక్టోబర్ 23వ తేదీలోగా జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో, ఎన్ఐబీ , ఐటీ కోర్ కార్యాలయాలలో పెన్ డ్రైవ్ ద్వారా షార్ట్ ఫిలింను అందించాలని తెలియజేశారు.
విద్యార్థులకు వ్యాస రచన పోటీలు
పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, ఆదిలాబాద్ జిల్లాలోని విద్యార్థిని, విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. (డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర.. విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండగలరు) అనే అంశంపై పోటీలు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో 6వ తరగతి నుండి పీజీ వరకు ఉన్న విద్యార్థులు పాల్గొనవచ్చని అన్నారు. విద్యార్థులు తమ వ్యాసాలను అక్టోబర్ 28వ తేదీలోగా సమర్పించాలని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. అంతేకాకుండా జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజేతలకు బహుమతులు ప్రదానం ఉంటుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి బహుమతులు పొందాలని ఎస్పీ సూచించారు.


