షార్ట్ సర్క్యూట్.. బట్టల షాపు దగ్ధం…
కాకతీయ,నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని జయశ్రీ టాకీస్ సమీపంలో గల ఓ క్లాత్ స్టోర్ షాపు లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి షాపు పూర్తిగా దగ్ధమైన సంఘటన నర్సంపేట పట్టణంలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాద సంఘటనలో షాపులోని దుస్తులు, విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధం కావడంతో 80 లక్షల రూపాయల మేర నష్టం సంభవించినట్లు షాప్ యజమాని బొప్పరాతి రాజు తెలిపాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


