షాప్ లు బంద్…. రోడ్డెక్కని జనాలు.
కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల ధర్నాలు, నిరసనలు
కాకతీయ, పెద్దవంగర: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. హైకోర్టు స్టేను నిరసిస్తూ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్,సీపీఐ నాయకులు రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో ఉన్న షాప్ లను బంద్ చేయించారు. దాంతో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.



