కాకతీయ, క్రైమ్ న్యూస్: ఏపీలోని విజయవాడలో దారుణ ఘటన జరిగింది. అభం, శుభం తెలియని బాలికపై సొంత బాబాయి అత్యాచారానికి పాల్పడ్డాడు. విజయవాడకు సమీపంలోని ఓ గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఆ బాలిక తల్లిదండ్రులు అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆ బాలిక బాబాయి దగ్గర ఉంటుంది. అయితే గత కొన్నాళ్లుగా ఆ బాలిక అనారోగ్యంగా ఉంటోంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు ఆమె గర్భం దాల్చినట్లు చెప్పారు. బాబాయ్ అత్యాచారం చేశాడని బాలిక షాకింగ్ విషయాన్ని చెప్పింది. కేసు నమోదు చేసుకన్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Crime News: మైనర్ బాలికపై బాబాయి అత్యాచారం..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


