బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి గండ్రకోట సుధీర్
మంత్రి సీతక్క సమక్షంలో చేరిక
ములుగులో కాంగ్రెస్‌కు మరింత బలం
మున్సిపల్ ఎన్నికల వేళ కీలక పరిణామం
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన జిల్లా సీనియర్ నాయకుడు, ములుగు మాజీ ఎంపీపీ గండ్రకోట సుధీర్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర మంత్రి సీతక్క సమక్షంలో జరిగిన కార్యక్రమంలో వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ చేరికలు బీఆర్‌ఎస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. గండ్రకోట సుధీర్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు కాంగ్రెస్ గూటికి చేరడంతో ములుగులో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి చింతనిప్పుల చంద్రకళ–బిక్షపతి ఆధ్వర్యంలో పలువురు బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి సీతక్క స్వయంగా వారిని పార్టీలోకి ఆహ్వానించి అభినందించారు. ఈ సందర్భంగా చేరిన నేతలు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి సీతక్క నేతృత్వంలో జిల్లాలో వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ములుగు పట్టణంలో రహదారులు, మౌలిక వసతులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా అమలవుతున్నాయని చెప్పారు. ఈ అభివృద్ధిని చూసే తాము కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి పూర్తి స్థాయిలో పనిచేస్తామని, పార్టీ విజయానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్‌తో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, యువజన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


