కవితను టార్గెట్ చేసిన గులాబీ ఎమ్మెల్యేకు షాక్
ఎమ్మెల్యే కుమారుడి రియల్ సంస్థపై హైడ్రా దాడులు
కవితను టార్గెట్ చేసిన గులాబీ ఎమ్మెల్యేకు షాక్
ఎమ్మెల్యే కుమారుడు డైరెక్టర్‌గా ఉన్న రియల్ సంస్థపై హైడ్రా దాడులు
కవిత గారు చేసిన చెరువు ఆక్రమణలు వ్యాఖ్యలు హైడ్రా దృష్టికి రావడంతో హుటాహుటిన పరిశీలనకు వెళ్లిన హైడ్రా టీం
కవిత తాను మామూలు నాయకురాలు కాదు అని పలు సార్లు చెప్పిన… pic.twitter.com/h1W1WfZMsG
— Yashin Tweets (@Yashinzayn) December 15, 2025
కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు తిరిగి గులాబీ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చినట్లయ్యాయి. ఎమ్మెల్యే కుమారుడు డైరెక్టర్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థపై హైడ్రా అధికారులు దాడులు నిర్వహించడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. కవిత చెరువు ఆక్రమణలపై చేసిన వ్యాఖ్యలు హైడ్రా అధికారుల దృష్టికి వెళ్లడంతో, వారు హుటాహుటిన పరిశీలనకు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కుమారుడికి చెందిన రియల్ సంస్థపై తనిఖీలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కవితపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే, ఆమెపై రాజకీయంగా దాడి చేయాలనే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హంగా మారింది. మరోవైపు కవిత తాను సాధారణ నాయకురాలు కాదని, అవసరమైతే తగిన విధంగా సమాధానం ఇస్తానని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో రాజకీయంగా విమర్శలు–ప్రతివిమర్శలు మొదలయ్యాయి. హైడ్రా దాడుల వెనుక రాజకీయ కోణం ఉందా..? లేక నిబంధనల ప్రకారమే చర్యలా..? అన్న అంశంపై చర్చ జరుగుతోంది. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం మరింత మలుపులు తిరుగుతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.


