కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా శివధర్ రెడ్డి ఉన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. శివధర్ రెడ్డిని నియమిస్తూ ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1వ తేదీన తెలంగాణ డీజీపీగా బాధ్యతలు శివధర్ రెడ్డి చేపట్టనున్నారు.


