తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ జితేందర్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనుండడంతో కొత్త పోలీస్ బాస్‌గా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న శివధర్ రెడ్డిని నియమించింది.


