శత్రు శేషం లేకుండా పోరాడిన వీరుడు శివాజీ
మరిపెడలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో చిత్రపటానికి నివాళులు
భారీ బైక్ ర్యాలీతో మార్మోగిన పట్టణం
కాకతీయ, మరిపెడ : హిందూ సామ్రాజ్య స్థాపన కోసం తన ప్రాణాలను అర్పించి శత్రువులతో శత్రు శేషం లేకుండా వీరోచితంగా పోరాడిన మహా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని ఫ్రెండ్స్ యూత్ సభ్యులు పేర్కొన్నారు. గురువారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం యూత్ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో ప్రాంతం మార్మోగింది. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, నాయకత్వం, దేశభక్తి ప్రతి భారతీయుడికి ఆదర్శమని తెలిపారు. హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఆయన చేసిన త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని పేర్కొన్నారు. శత్రువులను ఎదుర్కొనే ధైర్యం, సంకల్పబలం యువతకు మార్గదర్శకమని తెలిపారు. శివాజీ చూపిన మార్గంలో నడుస్తూ దేశభక్తి, సామాజిక బాధ్యతలను పెంపొందించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ సభ్యులు దేవరశెట్టి గణేష్, అక్కినపల్లి భాస్కర్, భయ్యా మహేష్, దేవరశెట్టి ఉమేష్, ఉప్పల రమేష్, దేవరశెట్టి శ్రీకాంత్, ముదిరెడ్డి నరేష్ రెడ్డి, వెర్మారెడ్డి సంతోష్ రెడ్డి, దేవరశెట్టి లక్ష్మీనారాయణ, కొడిపిగంటి కర్ణాకర్, ఏదులాపురం రాజు, డాక్టర్ వేణు, నాగరాజు, గంధసిరి ఉమేష్, వంగవీటి కిరణ్, డోజర్ బిక్షం, కొరివి లింగన్న, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


