తిమ్మాపూర్‌లో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
కాకతీయ కరీంనగర్ : జై భవాని వీర శివాజీ సేన ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్ పరిధి శ్రీ వెంకటేశ్వర కాలనీలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెండా గద్దె ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో శివాజీ సేన నాయకులు, స్థానికులు పాల్గొని శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హైందవ ధర్మ స్థాపన కోసం పోరాడిన మహా యోధుడు శివాజీ మహారాజ్ అని కొనియాడారు. భారత జాతిలో స్వాభిమానాన్ని నూరిపోసిన గొప్ప నాయకుడిగా అభివర్ణించారు. జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానంతరం తిమ్మాపూర్ మండల జై భవాని వీర శివాజీ సేన, ఫ్రీడమ్ ఫైటర్స్ స్ఫూర్తి స్థల్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా చిందం నరసయ్య, అధ్యక్షుడిగా కొత్తూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కన్నం సాయి కృష్ణను ఎన్నుకున్నారు. తదితరులు పాల్గొన్నారు.


